అంబర్ పేట్ డివిజన్ న్యూ ప్రేమ్ నగర్లో సోమవారం డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ ప్రజలతో కలిసి నాలాను పరిశీలించారు. స్థానికులు నాలా పూడికతీత పనులు చేపట్టాలని కార్పొరేటర్ కు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ సంభందిత అధికారులకు, సిబ్బందికి సమస్యను వివరించి ప్రేమ్ నగర్ లోని నాలాలో వ్యర్థాలను తొలగించాలని పూడికతీత పనులను చేపట్టాలని ఆదేశించారు