
చైనాలో మరో కొత్త వైరస్ గుర్తింపు!
చైనాలో కొవిడ్ తరహాలో ఉండే మరో కొత్త వైరస్‌ను గుర్తించారు. చైనా శాస్త్రవేత్తల బృందం తాజాగా గబ్బిలాల్లో 'హెచ్‌కెయూ5- కోవ్-2’ వైరస్‌ను గుర్తించింది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని సామర్థ్యం కొవిడ్ కన్నా తక్కువేనని పరిశోధనలో గుర్తించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం పేర్కొంది. ఈ వైరస్‌ను తొలుత హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు.