ప్రతి ఇంట్లోనూ అత్తాకోడళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు వెలుపల అత్తా కోడలు జుట్టు పట్టుకుని ఘోరంగా కొట్టుకున్నారు. ఓ కేసు విచారణ కోసం వారు కోర్టుకు చేరుకున్నారు. ఇంతలోనే కోడలి సోదరుడితో అత్త గొడవకు దిగింది. దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగడంతో అత్త, కోడలితో పాటు ఆమె తమ్ముడు, ఇతర కుటుంబీకులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.