
భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు
TG: మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అభియాన్ హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. హోటల్ రెండో అంతస్తులో ఉన్న ఆరుగురు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. దీంతో వారిని రక్షించేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.