మార్చి 23 నుంచి IPL-2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆదివారం ధృవీకరించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ, మే 25న కోల్‌కతాలో ఫైనల్ జరుగుతుందని వెల్లడించారు. అయితే పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఏడాది కాలానికి IPLకు కొత్త కమిషనర్‌ను నియమిస్తామని పేర్కొన్నారు.