అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిర్చు ఇంకా రగులుతూనే ఉంది. దీని వల్ల ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని అక్కడి మీడియా వెల్లడించింది. 10 వేల ఇళ్లు మంటల్లో కాలిపోయాయని, దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. కాగా మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఆ విమానానికి మంటలు అంటుకోవడంతో పాటు కాసేపటికే అది కుప్పకూలింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.