నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెల్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన అనంతపురంలోనే సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే ఈ వేడుక ఉంటుందన్నారు. వేడుక తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.