హిమాచల్ ప్రదేశ్‌లోని జోగిందర్‌నగర్‌లోని భరారు గ్రామం సమీపంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ జీపు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి హుటాహుటిన బాధితులను తండా మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.