Top 10 viral news 🔥
తెలంగాణలో దారుణం.. ప్రేమజంట ఆత్మహత్య (వీడియో)
సంగారెడ్డి (D) మునిపల్లి(M) బుసారెడ్డి పల్లి వద్ద ఉన్న హరిత రెస్టారెంట్లో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం హరిత రెస్టారెంట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా.. హోటల్ సిబ్బంది వెళ్లి డోర్‌ను తట్టారు. డోరు తెరువకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఆ ప్రేమ జంట ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని ఎస్ఐ రాజేష్ తెలిపారు.