టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్, ధన్‌శ్రీ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో స్టార్ జోడీ కూడా ఈ బాటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రికెటర్ మరెవరో కాదు మనీశ్ పాండే. 2019లో నటి ఆశ్రితా శెట్టిని మనీశ్ వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారని, పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.