జాయ్ జెమీమా హనీట్రాప్ కేసులో కీలక పరిణామం
కిలాడీ లేడీ జాయ్ జెమీమా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెమీమాను కస్టడీలో తీసుకున్న భీమిలీ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. జెమీమాతో ఎవరు హనీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగాయి. అయితే ఈ కేసులో ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్‌లోని డేటా కీలకంగా మారింది. ఫోన్ పే వంటి నగదు ట్రాన్సాక్షన్స్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.