కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన బండారు శ్రీకాంత్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో వెతకాలంటూ గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఈ విధంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రజలకు సేవలు అందించాలన్నారు. పోలీసులు పది రోజుల్లో కేసీఆర్ ఆచూకీ తెలపకపోతే.. తామే స్వయంగా గాలిస్తామన్నారు.