కూకట్ పల్లి నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్ లో పూట్ పాత్ ఆక్రమణల తొలగింపుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. పేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా పొట్ట కూటి కోసం అక్కడ వ్యాపారం చేసుకుంటుంటే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టి వారిని తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు సంబంధించి నోటీసుకు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. పేద ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పారు.