మంత్రి సుభాష్, ఎమ్మెల్యే సత్యప్రభలకు తప్పిన ప్రమాదం
ఏపీలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే సత్యప్రభకు తృటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎన్ఎస్ పట్నం గ్రామంలో శెట్టిబలిజ ఏర్పాటు చేసిన దొమ్మేటి వెంకట రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వీరు ఇరువురు పాల్గొన్నారు. వేదికపై మాట్లాడుతుండగా ఒక్కసారిగా వేదిక ఒరిగింది. సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఘటన తర్వాత వేదికపై కార్యక్రమం నిర్వహించారు.