ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇన్‌స్టా సేవల్లో సాంకేతిక ఇబ్బందులు ప్రారంభమైనట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు 2వేల ఫిర్యాదులు నమోదయ్యాయి. డైరెక్ట్ మెసేజులు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. దీనిపై ఇన్‌స్టా అధికారికంగా స్పందించలేదు.