ఓ మెకానిక్ షెడ్ లో అగ్నిప్రమాదం

2301చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పి. యస్ పరిధి బహదూర్ పల్లి లోని ఓ మెకానిక్ షెడ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం డిసియం వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ రెగ్జిన్ సీట్లు పై పడి మంటలు చెలరేగి ప్రకనే ఉన్న మిని బస్సు కు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మెకానిక్ షెడ్ లో ఉన్న ఓ డి. సి. యమ్ & మిని బస్సు అగ్నికి ఆహుతి అయ్యాయి.