కుత్బుల్లాపూర్: కరెంట్ షాక్ తో కార్మికుడు మృతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట్ కేవీఆర్ వ్యాలీ కాలనిలో రోడ్డుపై నిర్మిస్తున్న కమాన్(దర్వాజ) వల్ల మంగళవారం ఓ కార్మికుడు విద్యుతాఘాదంకు గురయ్యాడు. కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే వ్యక్తి మృతి చెందాడు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.