వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్

69చూసినవారు
వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
అంతరించిపోయే జాతికి చెందిన ఓ ఒరాంగుటాన్ తన శరీరంపై ఉన్న గాయాలకు ఔషద మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఇండోనేషియాలోని సువాక్ బాలింబింగ్ పరిశోధన కేంద్రంలో ఇది చోటుచేసుకుంది. రాకుస్ అనే మగ ఒరాంగుటాన్ ముఖానికి గాయమైనట్లు వారు గమనించారు. అయితే 3 రోజుల తర్వాత ఆ జీవి.. ఫైబ్రారేరియా టింకోటోరియా అనే మొక్క పసరును ఉపయోగించి తన గాయాన్ని నయం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్