అత్త మరణ వార్త విని.. గుండెపోటుతో అల్లుడి మృతి
TG: అత్త మరణవార్త విని అల్లుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్ల(D) వేములవాడ మార్కండేయనగర్కు చెందిన అలువాల లక్ష్మి (82) శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. ఈ వార్త విన్న ఆమె పెద్ద అల్లుడు జగిత్యాల(D) కథలాపూర్(M) గంభీర్పూర్కు చెందిన గుంటుక పర్శరాం (58) గుండెపోటుతో కుప్పకూలాడు. ఫోన్లో సమాచారమివ్వగా దైవదర్శనానికి విజయవాడకు వెళ్లిన పర్శరాం అక్కడే మరణించినట్లు బంధువులు తెలిపారు. ఒకేరోజు అత్త, అల్లుడు మరణించడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.