తాను చికెన్ గున్యా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్‌గా ఉందని రాసుకొచ్చారు. ఈ మేరకు వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు. కాగా, మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి ఇటీవలే సమంత కోలుకున్నారు.