AP: సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందెలు, జంతు హింస జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పండుగకు 3 రోజులు ముందుగానే కోడి పందెలు ప్రారంభం అయ్యాయి. అమలాపురంలో కొందరు బహిరంగంగా టెంట్లు వేసి కోడి పందెలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్లలో సీక్రెట్‌గా పందెలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈసారి భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారే అవకాశం ఉంది.