ఆస్పత్రిలో ఈ నినాదాలేంటి? వైసీపీపై టీడీపీ ఫైర్

52చూసినవారు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను వైసీపీ పరామర్శించిన తీరును టీడీపీ తప్పుపట్టింది. ‘ఆస్పత్రి ప్రాంగణంలో ఆంబోతుల్లా రంకెలు వేసుకుంటూ వెళుతున్న వీళ్లు ఎవరో గుర్తుపట్టారా? మంత్రులుగా పని చేసిన రోజా, పెద్దిరెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ రౌడీ మూకలు ఐసీయూపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా రోగుల సెలైన్ స్టాండ్లు, ఇతర సున్నితమైన వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. ఆస్పత్రికి వెళ్లి ఈ నినాదాలేమిటి? ఈ సైకోలను ఏమనాలి?’ అని టీడీపీ ట్వీట్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్