పవన్ కళ్యాణ్ 'OG' సినిమాపై మేకర్స్ కీలక ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఓజీ' సినిమాపై మేకర్స్ కీలక ప్రకటన చేశారు. 'ఓజీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం మా అదృష్టం. కానీ పవన్ ఎక్కడికి వెళ్లినా మీరు ఓజీ.. ఓజీ అని అరిచి ఇబ్బంది పెట్టొద్దు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయనను, ఆయన స్థాయిని గౌరవించండి. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఓజీ పండుగ వైభవం చూద్దాం' అని తెలిపారు.