మహారాష్ట్ర పర్భానీలోని గంగాఖేడ్ నాకా ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మైనా కాలేను ఆమె భర్త కుందాలిక్ కాలే నిత్యం దూషించడం, కొట్టడం చేసేవాడు. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని గురువారం రాత్రి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన మైనా ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో నిందితుడు కుందాలిక్ కాలేను పోలీసులు అరెస్టు చేశారు.