AP: రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం
ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ సర్కార్ జీవో జారీ వేసింది. రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదరికంలో ఉన్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు పేర్కొంది. 475 జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలంటూ రూ.115 కోట్లు కేటాయించింది.