AP: తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని మార్కెట్‌లో మంగళవారం దారుణం జరిగింది. అజంతుల్లా అనే వ్యక్తి మహబూబ్ సాహెబ్ అనే యజమాని దగ్గర కూరగాయల షాపులో పని చేస్తుంటాడు. వీరి దగ్గరి నుంచి రెగ్యులర్‌గా రుద్ర అనే వ్యక్తి కూరగాయలు తీసుకెళ్తుంటాడు. షాపు నుంచి రుద్రకు రూ.1500 రావాల్సి ఉంది. ఇవాళ డబ్బు విషయంలో గొడవ జరగగా.. యజమానిని రుద్ర పొడిచే క్రమంలో అజంతుల్లా అడ్డుపడగా.. కత్తిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.