హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ జంటకు ఎట్టకేలకు విడాకులు మంజూరయ్యాయి. ఈ జంట సెప్టెంబరు 2016లో విడాకుల కోసం దాఖలు చేశారు. దాదాపు 8 ఏళ్లుగా కోర్టులో వీరి పోరాటం జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు వీరిద్దరూ విడాకులతో తమ బంధం తెంచుకున్నారు. ఏంజిలీనా లాయర్ మాట్లాడుతూ.. ఆమె, ఆమె పిల్లలు పిట్‌తో పంచుకున్న ఆస్తులన్నింటినీ వదులుకున్నారు. వారు కుటుంబ శాంతి, వైద్యం దృష్ట్యా విడాకులు తీసుకున్నారని, వారి వివాహ బంధం ముగిసింది' అని పేర్కొన్నారు.