ఈ ఏడాదికి ‘అమరన్’ బెస్ట్ చిత్రమని నటి జాన్వీ కపూర్ పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమా చూసిన జాన్వీ రివ్యూ ఇచ్చారు. ‘‘ఈ సినిమా చూడటం కొంచెం ఆలస్యమైంది. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం భావోద్వేగంతో నిండి ఉంది. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించాను. ‘అమరన్’ నా హృదయాన్ని కదిలించింది. ఇందులోని ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయి’’ అని రాసుకొచ్చారు.