నాంపల్లిలోని పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం (వీడియో)
హైదరాబాద్ నాంపల్లి ఏక్‌మినార్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. HP పెట్రోల్ బంక్‌లో ఆయిల్ నింపేందుకు వచ్చిన ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.