AP: రాష్ట్రంలో రేషన్ మాఫియా మళ్లీ వచ్చిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన స్వర్ణ రకం బియ్యం ఇవ్వడం లేదని, సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేదన్నారు. ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నారని తెలిపారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడే బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నారని, కానీ ఆ నిందలు తమపై వేస్తున్నారని మండిపడ్డారు.