నేడే వారి అకౌంట్లో జీతాలు జమ
AP: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నేడు (మంగళవారం) వీరి ఖాతాల్లో జీతాలు పడనున్నాయి. జీతం చెల్లింపునకు ఒక రోజు ముందుగా స్లాట్ ఇవ్వడంతో ఇవాళ వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఆర్ ఉద్యోగులకు 1న జీతాలు అందుతున్నాయని, జనవరి 1న ఇవ్వాల్సిన జీతం డిసెంబర్ 31నే ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో నేడు పింఛన్లు పంపిణీ చేయనున్నారు.