కాసేపట్లో చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరికాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లనున్నారు. చిరు కుటుంబ సభ్యులతో కలిసి బన్నీ లంచ్ చేస్తారని తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శనివారం జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత చిరు సతీమణి సురేఖ అరవింద్ ఇంటికి వెళ్లి మాట్లాడారు.