కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పతనంతిట్ట జిల్లా కురింజకల్లి వద్ద భక్తులతో వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అను, నిఖిల్‌కు ఇటీవలే వివాహం జరిగింది. హనీమూన్‌కు మలేషియా వెళ్లి రిటర్న్ అయి తిరువనంతపురం విమానాశ్రయం చేరుకున్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి మత్తై, బిజు జార్జ్ వెళ్లారు. నూతన దంపతులను రిసీవ్ చేసుకుని కారులో ఇంటికి బయలుదేరుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.