జమిలి ఎన్నికలపై పునరాలోచనలో కేంద్రం!

83చూసినవారు
జమిలి ఎన్నికలపై పునరాలోచనలో కేంద్రం!
జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా లోక్‌సభ బిజినెస్‌ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించారు. తొలుత ఈ నెల 16న లోక్‌సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఆ మేరకు లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ బిల్లు పెడతారని కేంద్రం పేర్కొంది. కానీ.. తాజాగా రివైజ్డ్‌ చేసిన దాంట్లో జమిలి ఎన్నికల బిల్లులు లేవు. ఇక ఈ నెల 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి.

సంబంధిత పోస్ట్