AP: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతుర్ని వేధిస్తున్న యువకుడిని కనకరాజు అనే వ్యక్తి మందలించారు. ఇంకోసారి తన కూతురు జోలికి రావొద్దని హెచ్చరించారు. దాంతో కోపోద్రిక్తుడైన యువకుడు కనకరాజును కత్తితో పొడిచి చంపాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.