బెనెగల్ తీసిన సినిమా అంటే చాలు.. దానికి అవార్డు దక్కాల్సిందే!
శ్యామ్ బెనెగల్ తొలి సినిమా మొదలు ఆయన రూపొందించిన వాటిలో నాలుగు మినహా ప్రతి చిత్రానికీ అవార్డు దక్కడం విశేషం. ‘నిషాంత్’, ‘భూమిక’, ‘మండి’, ‘హరి భరి’.. ఇలా ప్రతి సినిమా జాతీయ పురస్కారాన్నో, నర్గీస్ దత్ అవార్డునో సొంతం చేసుకుంది. 20కిపైగా సినిమాలు, దాదాపు 40 డాక్యుమెంటరీలు, పలు టీవీ సీరియళ్లు రూపొందించారు. వాస్తవికతకు అద్దం పట్టే తన కథల్లో స్టార్ నటులు ఎక్కువగా కనిపించరు.