అల్లు అర్జున్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

67చూసినవారు
అల్లు అర్జున్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని సీఎం రేవంత్ ఆదేశించారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో కూడా అల్లు అర్జున్ వ్యవహారంపై పార్టీకి చెందిన నేతలు ఎవరూ మాట్లాడవద్దన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని తెలంగాణ పీసీసీకి సీఎం స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్