
CT ఫైనల్.. భారత్ లక్ష్యం 252 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ (63), బ్రేస్వెల్ 53* అర్థశతకాలతో రాణించగా.. రచిన్ 37, ఫిలిప్స్ 34 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్, కుల్దీప్, చెరో రెండు వికెట్లు తీయగా జడేజా, షమీ తలా ఒక వికెట్ తీశారు.