హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చలానా మెసేజ్ వస్తుంది. ఈ-చలానా పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ మెసేజ్‌లు పంపి, సగం డబ్బు కడితే చాలని లింక్ క్లిక్ చేయమంటారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే వారి చేతుల్లోకి మొబైల్ డేటా, బ్యాంకు వివరాలు వెళ్లిపోతాయి. కొన్నిసార్లు మొబైల్ హ్యాక్ అవుతుంది, ఫొటోలు, వివరాలతో డబ్బు కొట్టేస్తారు.