ఘర్షణలతో అట్టుడుకుతున్న సిరియాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు బషర్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా మృతి చెందారు. బనీయాస్ పట్టణంలో మహిళలను నగ్నంగా ఊరేగించి, తర్వాత హతమార్చినట్లు ప్రత్యక్ష సాక్షులు అంతర్జాతీయ మీడియాతో చెప్పారు. శవాలు ఎక్కడపడితే అక్కడ పడిఉన్నట్లు వెల్లడించారు.