సీఎంఆర్ఎఫ్ సహాయంతో ఉచిత వైద్య సేవలు పొందవచ్చని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అన్నారు. బుధవారం లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 50 మందికి చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.