కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్
లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్‌ను తొలగించారు. ఇవాళ జరిగిన డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. జోసెఫ్ ప్రకాష్ ఎన్నికతో జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. తదనంతరం అసోసియేషన్ నుంచి ఆయన్ను శాశ్వతంగా తొలగించారు.