సినీప్రియులకు శుభవార్త. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప-2' సినిమా టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 నుంచి రూ.150 మేర ధరలు తగ్గాయి. రేపటి నుంచి తగ్గిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ సైట్లలో తగ్గించిన ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇదిలాఉంటే ఈ సినిమా టికెట్ ధరలు భారీగా పెంచడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన విషయం విదితమే.