విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించిన మోడీ
గుజరాత్‌లోని వడోదరలో సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని సోమవారం ప్రధాని మోడీ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి ప్రారంభించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022 OCTలో మోదీ శంకుస్థాపన చేశారు. భారత్‌కు 56 సి-295 విమానాల సరఫరాకు 2021 SEPలో రూ.21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ సంస్థ నుంచి అందుతాయి. మిగతావి వడోదర యూనిట్లో సిద్ధమవుతాయి.