ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఒక దశలో 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పంత్ క్రీజులో నిలదొక్కుకొని మంచి రన్స్ చేయడంతో మ్యాచ్ మళ్లీ గాడిలో పడ్డట్లే కనిపించింది. 64 పరుగులు చేసి అతడు వెనుదిరగడంతో మళ్లీ వికెట్లు చకచకా పడ్డాయి. దీంతో 121 పరుగులకు భారత్ ఆలౌటై.. 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీశారు.