భారత యువ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్, ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ విమానాశ్రయంలో సిబ్బంది కారణంగా తాను ఫ్లైట్ మిస్ కావాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అనుభవాన్ని పంచుకున్న అభిషేక్, సమయానికి కౌంటర్ వద్దకు చేరుకున్నప్పటికీ సిబ్బంది అనవసరంగా మరొక కౌంటర్‌కు పంపారని, ఈ కారణంగా చెక్-ఇన్ క్లోజ్ అయ్యి ఫ్లైట్ మిస్సైందని చెప్పారు. దీంతో ఇండిగో పండుగ ఆనందాన్ని దూరం చేసిందని తెలిపారు.