సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల మండలం గండేపల్లిలో టెంట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కోడి పందేలను ప్రారంభించారు. వీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.