IPL: వీరవిహారం చేసిన రావత్, కార్తీక్ (వీడియో)

1096చూసినవారు
బెంగళూరు బ్యాటర్లు అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ వీర విహారం చేశారు. 12 ఓవర్లకు జట్టు స్కోరు 79/5 ఉండగా క్రీజులోకి వచ్చిన వీరు తమదైన శైలిలో బ్యాటును ఝులిపించారు. 50 బంతుల్లో 95 భాగస్వామ్యం నెలకొల్పారు. రావత్ 4 ఫోర్లు, 3 సిక్స్ ల సహాయంతో 48, దినేష్ కార్తిక్ 3 ఫోర్లు, 2 సిక్స్ ల సహాయంతో 38 పరుగులు చేశారు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకొని భారీ స్కోరును అందించారు. వీరి ధాటికి బెంగళూరు స్కోరు 173కు చేరుకుంది.