మదర్స్ డే వేళ మోదీకి స్పెషల్ గిఫ్ట్

76చూసినవారు
మదర్స్ డే వేళ మోదీకి స్పెషల్ గిఫ్ట్
పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీకి ఊహించని బహుమానం అందింది. మాతృదినోత్సవం రోజున మోదీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీనిపట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రధాని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఈ అరుదైన సన్నివేశం ఆదివారం చోటు చేసుకుంది.