
YS వివేకా హత్య కేసు.. కీలక సాక్షి రంగన్న మృతి
మాజీ మంత్రి YS వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, వాచ్మెన్ రంగన్న చనిపోయారు. కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ కడప రిమ్స్‌లో బుధవారం తుదిశ్వాస విడిచారు. YS వివేకా హత్య కేసు విచారణలో రంగన్న పలు కీలక విషయాలు వెల్లడించారు. హత్యలో ఎర్ర గంగిరెడ్డి పాల్గొన్నట్లు ఆయన సీబీఐ అధికారులకు గతంలో వాంగ్మూలం ఇచ్చారు.